శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం లో ఘనంగా ప్రారంభమైన దసరా ఉత్సవాలు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో వెలసి ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో సోమవారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవముగా ప్రారంభించారు. ఈ వేడుకల్లో భాగంగా ముందుగా అమ్మణ్ణికి ప్రత్యేక అభిషేకాలు చేసి అలంకరించారు. అనంతరం వేదపండితులు అమ్మణ్ణి ఎదుట కలిశా స్థాపన చేసి కాళంగి నది తీరానికి వెళ్లి అక్కడ నుండి నదీ జలాలను తీసుకువచ్చి కలిశాలలో నింపి పూజలు ప్రారంభించారు. ముందుగా గణపతి పూజ చేసి కలిశాలలోని మంత్రజలాలలోకి సకల దేవతలను ఆవాహన చేసి కలిశా పూజలు జరిపించారు. అనంతరం ఆలయ సహాయక కమీషనర్ ప్రసన్న లక్ష్మి పర్యవేక్షణలో ప్రారంభమైన ఈ ఉత్సవాలలో భాగంగా ఆమె చేతులు మీదుగా అఖండ జ్యోతిని అమ్మ