ఇబ్రహీంపట్నం: అల్విన్ కాలనీ డివిజన్లో ధన్వంతరి జయంతి సందర్భంగా నివాళులర్పించిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్
ఆల్విన్ కాలనీ డివిజన్లో ధన్వంతరి జయంతి సందర్భంగా పీజేఆర్ నగర్ లోని ధన్వంతరి విగ్రహానికి ఆదివారం మధ్యాహ్నం కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి ఆయుర్వేద వైద్యుడు ధన్వంతరి అని అన్నారు. వ్యాధుల నివారణకు ధన్వంతరి ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. ఆయుర్వేద రంగంలో ఆయన చేసిన సేవలు మరువలేనివని తెలిపారు.