మార్కాపురం: సమయపాలన పాటించని సచివాలయ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 12వ వార్డు సచివాలయంలో మంగళవారం ఉదయం 11 గంటల దాటిన ఉద్యోగులు ఎవరు విధులకు హాజరు కాకపోవడం పై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో బుధవారం ఆలస్యంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సచివాలయ ఉద్యోగులు విధులకు సరైన సమయంలో హాజరు కాకపోవడంతో వారికోసం ప్రజలు పడికాపులు కాశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సచివాలయ ఉద్యోగులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.