రాప్తాడు: రాప్తాడు లో సిఐటియు ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించే సిఐటియు 18 వ మహాసభలో విజయవంతం చేయాలని బైక్ యాత్ర నిర్వహించారు.
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో సోమవారం 11 గంటల 35 నిమిషాల సమయంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో విశాఖపట్నం లో సిఐటియు 18 మహాసభల సందర్భంగా బైకు యాత్ర నిర్వహించి కరపత్రాలను కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు మనీల రామాంజనేయులు మాట్లాడుతూ డిసెంబర్ 31న విశాఖపట్నంలో సిఐటియు 18 మహాసభలు విజయవంతం చేసేందుకు సిఐటియు ఆధ్వర్యంలో బైకు యాత్ర నిర్వహించి కరపత్రాలను కార్మికులకు పంపిణీ చేయడం జరిగిందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు రామాంజనేయులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మన్న మధు పుష్పరాజ్ చెన్నప్ప ప్రకాష తదితరులు పాల్గొన్నారు.