అల్లాదుర్గం: రాంపూర్ శివారులోని ఉమా సంగమేశ్వర రైస్ మిల్లులో యువకుడి అనుమానాస్పద మృతి
Alladurg, Medak | Feb 10, 2025 మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామ శివారులో ఉన్న ఉమా సంగమేశ్వర రైస్ మిల్లులో గోండు కృష్ణ అనే వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందాడు. మిల్లులో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు తెలిసింది. కృష్ణ మృతి చెందాడనే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కృష్ణ మృతి పై అనుమానాన్ని వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.