సంగారెడ్డి: సిగాచి పరిశ్రమ బాధితులకు అండగా ఉంటాం: సంగారెడ్డిలో జేఏసీ జిల్లా చైర్మన్ అశోక్ కుమార్
సిగాచీ పరిశ్రమ బాధితులకు మద్దతుగా ఉద్యమాన్ని చేపడతామని తెలంగాణ జేఏసీ సంగారెడ్డి జిల్లా చైర్మన్ అశోక్ కుమార్ తెలిపారు. మంగళవారం సంగారెడ్డిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం విడతలవారీగా పరిహారం చెల్లిస్తామని చెప్పడం సరికాదని తెలిపారు. ప్రభుత్వ అధికారుల విధానాలు యాజమాన్యానికి అనుకూలంగా ఉన్నాయని బాధ్యతలకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.