అసిఫాబాద్: చేతి పంపు మరమ్మత్తులు చేపట్టండి:CITU మండల కన్వీనర్ ఆనంద్ రావు
చేతి పంపు చెడిపోయి నెలలు గడుస్తున్న పట్టించుకునే నాధుడు లేడని CITU మండల కన్వీనర్ ఆనంద్ రావు అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కెరమెరి వారసంతలో ఉన్న చేతి పంపు పని చేయడం లేదని తాగునీరు కోసం వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు,వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. పలు మార్లు అధికారులకు చెప్పిన కూడా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చేతిపంపు మరభత్తులు చేయాలని కోరారు.