పుంగనూరు: 30 లక్షల రూపాయల స్వాహా చేసిన సంఘమిత్రపై చర్యలకు డిమాండ్.
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మంగళం పంచాయతీ జెట్టిగుండ్లపల్లి గ్రామంలో సంఘమిత్ర లక్ష్మీదేవి దాదాపు 30 లక్షల రూపాయలు సభ్యుల సొమ్మును స్వాహా చేశారని సంఘం సభ్యులు బుధవారం మధ్యాహ్నం ఒక గంట ప్రాంతంలో మండల మహిళా సమైక్య కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని సంఘం సభ్యులు డిమాండ్ చేశారు.