గజపతినగరం: లైసెన్స్ కలిగి ఉన్న ఆటో డ్రైవర్ల అందరికీ వాహన మిత్ర పథకం అమలు చేయాలి: గజపతినగరం లో సిఐటియు జిల్లా కార్యదర్శి పురం
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన ఉచిత బస్సు పథకం కారణంగా తమ బతుకులు రోడ్డున పడ్డాయని ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం మధ్యాహ్నం గజపతినగరంలో ఆటో డ్రైవర్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని నాలుగు రోడ్ల జంక్షన్ లో మానవహార ప్రదర్శన జరిపి పలు నినాదాలు చేశారు. దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి పురం అప్పారావు మాట్లాడుతూ, లైసెన్స్ ఉన్న ఆటో డ్రైవర్ అందరికీ వాహన మిత్ర పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.