మేడ్చల్: పర్వతాపూర్ లో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్ గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోచమ్మ తల్లి ఆశీస్సులతో పర్వతాపూర్ గ్రామ ప్రజలు ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషంతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. మన సమాజంలో దేవాలయాలు కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాకుండా, ఐకమత్యం,సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు.