రాయదుర్గం మండలంలోని రాయంపల్లి గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గౌడవలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు పోలీసుల వివరాల మేరకు బుధవారం రాత్రి దేవాలయం డబ్బులు వేలంవేసే సమయంలో రాజు, చిత్తయ్య వర్గాలకు చెందిన వారు గొడవపడ్డారు. రాజు అనే వ్యక్తి గాయపడ్డాడు. సమాచారం అందుకున్న సిఐ జయనాయక్ ఘటన స్థలానికి చేరుకుని గుంపలను చెదరగొట్టారు. పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల వారు పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.