కోరుట్ల: మెట్పల్లి పట్టణంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ నిమజ్జన యాత్ర వైభవంగా కొనసాగింది
మెట్పల్లి వైభవంగా విశ్వకర్మ నిమజ్జన యాత్ర మెట్పల్లి పట్టణంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ నిమజ్జన యాత్ర వైభవంగా కొనసాగుతుంది. మూడు రోజులుగా విశ్వకర్మ భగవానునికి ప్రత్యేక పూజలను నిర్వహించి నిమజ్జనానికి తీసుకొని వెళ్తున్నారు. పట్టణంలోని పలు వీధుల గుండా మేళతాళాలతో మహిళల కోలాటాలు, పురుషుల నృత్యాల మధ్య విశ్వకర్మ భగవానుని ఊరేగిస్తున్నారు. పట్టణ శివారులో గల వట్టివాగులో విశ్వకర్మ విగ్రహాన్ని నిమజ్జనం చేయనున్నారు.