తాడేపల్లిగూడెం: తేతలిలో సీఎం జగన్ ఆధ్వర్యంలో వైసీపీలోకి తాడేపల్లిగూడెం మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ గమిని సుబ్బారావు
తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ గమిని సుబ్బారావు గురువారం ఉదయం 10 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తణుకు మండలం తేతలి వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డి విడిది ప్రాంతంలో ఆయన స్వయంగా కలిసి వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా వేసి సీఎం జగన్ ఆహ్వానించారు. ఆయన వెంట ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, వైసీపీ నాయకులూ రాజా తదితరులు ఉన్నారు