కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని యోగి వేమన యూనివర్సిటీ వెయిటింగ్ హాల్ నిర్మాణానికి శుక్రవారం యోగి వేమన విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ భూమి పూజ నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రుల సౌకర్యార్థం అన్ని వసతులతో కూడిన ఈ హాలు ప్రధానమంత్రి ఉచ్చరత శిక్షా అభియాన్ నిధుల ద్వారా నిర్మిస్తున్నారన్నారు. పనులను త్వరగా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.