చేనేత కార్మికులకు మార్జిన్ మనీ విడుదల చేయాలని వినతి
శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి కెనరా బ్యాంక్ మేనేజర్ ప్రహ్లాదరావుకు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం వినతిపత్రం సమర్పించారు. 2023లో ఒక్కో చేనేత కార్మికుడు రూ.50,000 వీవర్స్ ముద్ర లోన్ పొందినప్పటి నుంచి నెలవారీ కంతులు జమ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే రూ.10,000ల మార్జిన్ మొత్తాన్ని చేనేత కార్మికులకు జమ చేయాలని వారు కోరారు.