గంజాయి,డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు జోలికి వెళితే భవిష్యత్తు అంధకారమే: జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి
Eluru Urban, Eluru | Sep 29, 2025
గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు జోలికి వెళితే భవిష్యత్తు అంధకారమని, కావున యువత మాదకద్రవ్యాల జోలికి పోకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో సోమవారం సాయంత్రం 6 గంటలకు మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ మాదకద్రవ్య రహిత జిల్లాగా ఏలూరు జిల్లాను రూపొందించేందుకు సమాజంలోని ప్రతీ ఒక్కరూ సహకరించాలన్నారు. భవిష్యత్తును అంధకారం చేసే గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల పట్టుబడితే కఠిన శిక్షలు తప్పవనన్నారు.