జమ్మలమడుగు: బద్వేల్ : పట్టణంలో ఏపీ కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదానం
కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సేవా సంఘం ఉమ్మడి కడప జిల్లా కు సంబంధించి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో పేదలకు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కొండపల్లి చిన్న సుబ్బారావు, స్టేట్ ఉపాధ్యక్షులు కొండపల్లి దేవి, ప్రెసిడెంట్ రెడ్డయ్య, కొండపల్లి సుభాష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.