తాడిపత్రి మండల వ్యాప్తంగా గురువారం అన్ని ప్రధాన దేవాలయాల్లో ధనుర్మాసం 16 వ రోజును పురస్కరించుకొని ధనుర్మాస వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా తాడిపత్రిలోని శ్రీ చింతల వెంకటరమణ ఆలయం, శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం, ఆలూరు కోన లోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ధనుర్మాస వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అభిషేకాలు, కాగడ హారతి ,హారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు వినియోగం చేశారు.