పెనుకొండలో ఆర్థిక విద్యరంగ సమస్యలపై రణభేరి
శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండలో బుధవారం మధ్యాహ్నం రణభేరి కార్యక్రమంలో భాగంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్.జయచంద్రా రెడ్డి ఆధ్వర్యంలో ఆర్థిక విద్యారంగ సమస్యలపై మూడోరోజు కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం నేటికీ అమలు చేయలేదన్నారు. 15 నెలలు గడుస్తున్నా ఉద్యోగ ఉపాధ్యాయులకు అందాల్సిన పీఆర్సీ, 30 శాతం ఐఆర్ అమలు చేయలేదన్నారు.