దర్శి: అక్రమంగా విద్యుత్ వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసులు
Darsi, Prakasam | Sep 16, 2025 ప్రకాశం జిల్లా దర్శి మండలంలో అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న వారిపై కేసుల నమోదు చేసినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని పలు గ్రామాలలో విద్యుత్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారని ఆ దాడుల్లో 16 మంది అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. వారికి రెండు లక్షల 75 వేల రూపాయలు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. అక్రమంగా విద్యుత్తు వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.