మంత్రాలయం: శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నోడల్ ఆఫీసర్ కృష్ణ మీట్టల్
మంత్రాలయం :శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నోడల్ ఆఫీసర్ కృష్ణ మీట్టల్, ఏపీ, తెలంగాణ అనిమల్ వెల్ఫేర్ బోర్డు మెంబర్ మహేశ్ అగర్వాల్ వచ్చారు. ఆదివారం వారికి శ్రీ మఠం అధికారులు స్వాగతం పలికారు. వారు గ్రామదేవత మంచాలమ్మ దేవిని, శ్రీ గురు రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ మఠం అధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలను పరిశీలించారు.