ఇబ్రహీంపట్నం: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి, ఉన్న పోలీసులు
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బండ్లగూడ జాకీర్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ బొడ్రాయి వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న కృష్ణ అని యువకుడుని గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.