వట్లూరులో కూల్ డ్రింక్ కావాలని వృద్ధురాలి పై కత్తితో దాడి చేసి బంగారు నగలు అపహరించిన అగంతకుడు
Eluru Urban, Eluru | Sep 14, 2025
గుర్తు తెలియని అగంతకుడు వృద్ధురాలిని కత్తితో దాడిచేసి ఆమె వద్ద ఉన్న బంగారం నగలను అపహరించుకు పోయిన ఘటన ఏలూరు త్రీటౌన్ లోని వట్లూరు లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బాధితురాలు సింగంశెట్టి నాగేశ్వరమ్మ స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తూ ఉంటుంది. కూల్ డ్రింక్ కావాలని వచ్చిన అగంతకుడు ఆమెపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి అనంతరం బంగారాన్ని అపహరించక పోయాడు. ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.