రాయదుర్గం: ముగ్గురు కలిసి మరో వ్యక్తిని గంజాయి కేసులో ఇరికించే కుట్రను భగ్నం చేసిన రాయదుర్గం పోలీసులు
ముగ్గురు వ్యక్తులు కలసి మరో వ్యక్తిని గంజాయి కేసులో ఇరికించే కుట్రను రాయదుర్గం పోలీసులు భగ్నం చేశారు. సోమవారం సిఐ జయనాయక్ తెలిపిన వివరాలమేరకు పట్టణంలోని చంద్రబాబు కాలనీలో ఉంటున్న గోళ్ల అఖిల్, ముత్తరాసి హరికృష్ణకు మనస్పర్ధలు ఉన్నాయి. అఖిల్ ను గంజాయి కేసులో ఇరికించే కుట్రలో తన మామ అనిల్ మరొక మహిళతో కలసి 518 గ్రాముల గంజాయి, 10 కిలోల శ్రీగంధం దుంగలు అఖిల్ ఇంటి ముందు ఉంచుతుండగా పోలీసులు అరెస్టు చేశారు.