పోలీస్ సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 105 ఫిర్యాదులు జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్
Nandyal Urban, Nandyal | Sep 15, 2025
నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 105 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు