సత్తుపల్లి: వరి పొలాలు వేసి నష్టపోయిన వారందరికీ నష్టపరిహారం అందిస్తాం సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూర్ మండలం, కందుకూరు, భరణి పాడు గ్రామాల్లో పర్యటించిన సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్ట రాగమయి, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరుణ్ అగ్రో టెక్ కంపెనీ వారు రైతులకు అందజేసిన వరి విత్తనాలు కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు అనే విషయం తెలుసుకొని వరి పొలాలను పరిశీలించినట్లు వారి పేర్కొన్నారు తక్షణమే కంపెనీ వారిపై చర్యలు తీసుకొని రైతులకు నష్టపరిహారం అందే విధంగా చర్యలు చేపడతానని ఎమ్మెల్యే రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు