పెనుకొండలో వైసీపీ ‘'ప్రజా ఉద్యమం' బైక్ ర్యాలీ
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం పెనుకొండ వై జంక్షన్ నుంచి మెడికల్ కాలేజీ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ నిర్మించిన ప్రజా మెడికల్ కాలేజీలను కాపాడాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ.. 'ప్రజల హక్కులను అమ్మే ప్రభుత్వాన్ని ప్రజలే కూలదోస్తారు. వైద్యం, విద్య ప్రతి పేద కుటుంబానికీ అందేలా పోరాటం కొనసాగుతుంది' అని అన్నారు.