హిమాయత్ నగర్: మూసాపేట మెట్రో స్టేషన్ లో బుల్లెట్‌తో వెళ్లిన బాలుడు, వివరాలు వెల్లడించిన సీఐ సుబ్బారావు
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో సిఐ సుబ్బారావు మూసాపేట మెట్రో స్టేషన్ లో 9 ఎం ఎం బుల్లెట్ తో బాలుడు వెళ్లిన ఘటనపై ఆదివారం సాయంత్రం వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రగతి నగర్ లోని బాలుడు నివాసానికి వెళ్లి విచారించామని బాలుడి సవితి తండ్రి ఆలం బిహారీ వాసి అని అతడు బాలుడి తల్లితోనే ఉంటున్నాడని తెలిపారు. అతని దగ్గర నుంచి బాలుడు బుల్లెట్ ను తీసుకొని వచ్చాడని తెలిపారు. ఆలం కు మిలిటరీలో తన ఫ్యామిలీలో ఒకరు ఉండే వారని ఆ సమయంలో బుల్లెట్ ను తన వెంట తెచ్చుకున్నాడు అని తెలిపారు. బుల్లెట్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.