జరుగుమల్లి మండలం కే అగ్రహారం గ్రామాన్ని ఆదివారం స్థానిక పోలీసులు స్కై ప్రాజెక్టు ద్వారా క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో అసాంఘిక కార్యకలాపాలు కోడిపందాలు పేకాట వంటివి అరికట్టేందుకు డ్రోన్ ఎగరవేసి అణువణువునా గ్రామాన్ని పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు. నేరా నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.