విజయనగరం: గంజాయి నిర్మూలనపై చర్యలు చేపడతామని తెలిపిన విజయనగరం జిల్లా నూతన ఎస్పీ ఏఆర్ దామోదర్
విజయనగరం జిల్లా SPగా ఏఆర్ దామోదర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు ఇచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు. గతంలో ఇక్కడ SPగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రత, సైబర్ నేరాల అరికట్టడంపై దృష్టి పెడతామని SP తెలిపారు. మహిళలు, బాలికల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, పోక్సో కేసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.