విద్యార్థినులు చట్టాలపై అవగాహనతో ఉండాలి: డీఎస్పీ
Gudur, Tirupati | Oct 24, 2025 విద్యార్థినులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని గూడూరు డీఎస్పీ డాక్టర్ పీ.గీతా కుమారి అన్నారు. శుక్రవారం పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ గీతా మహిళా రక్షణ, సైబర్ క్రైమ్ గురించి వివరించారు. మొబైల్ ఫోన్లతో కలిగే అనర్ధాలను వివరించారు.