మెదక్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఘనంగా జాతీయ హిందీ దినోత్సవం
ప్రిన్సిపాల్ హుస్సేన్
Medak, Medak | Sep 16, 2025 బియోహర్ రాజేంద్ర సింహ కృషి ఫలితమే హిందీ దివస్ ప్రొఫెసర్ హుస్సేన్. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హిందీ విభాగం ఆధ్వర్యంలో జాతీయ హిందీ దినోత్సవం నిర్వహించినట్టు ప్రధానాచార్యులు ప్రొఫెసర్ హుస్సేన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ జాతీయ భాష హిందీ ప్రతి ఒక్కరూ తప్పకుండా నేర్చుకోవాలని సూచించారు. భారత ప్రభుత్వం హిందీ భాషను జాతీయ భాషగా సెప్టెంబర్ 14న గుర్తించిందని తెలిపారు. ఈ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని ప్రజలందరినీ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చినది హిందీ భాష అని తెలిపారు.