భూపాలపల్లి: మహిళలకు వృత్తి శిక్షణ పరీక్షలు, ప్రారంభించిన ఏరియా పర్సనల్ మేనేజర్
భూపాలపల్లి ఏరియాలో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వృత్తి శిక్షణ కోర్సులకు హాజరైన మహిళలకు రాత పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానిక సుభాష్ కాలనీ ఎండి క్వార్టర్స్ ఫంక్షన్ హాల్ లో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించడం జరిగింది. ఇందులో మొత్తం 148 మంది మహిళలు హాజరై టైలరింగ్ ,ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్, డిటిపి , జ్యూట్ బ్యాగ్ ,కోర్సుల పరీక్షకు హాజరయ్యారు . ఈ పరీక్ష ప్రారంభించడానికి ముఖ్య అతిధిగా భూపాలపల్లి పర్సనల్ మేనేజర్ శ్రీ కావూరి మారుతి విచ్చేసి ప్రారంభించారు.