కోరుట్ల: మెట్ పల్లిలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు
మానసిక ఆరోగ్యం కాపాడుకోవాలి: సీనియర్ సివిల్ జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి డి నాగేశ్వర్ రావు మాట్లాడుతూ, యాంత్రిక జీవితంలో మానసిక ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. శుక్రవారం మెట్ పల్లి బార్ అసోసియేషన్ గదిలో ఈ కార్యక్రమం జరిగింది.