సిర్పూర్ టి: మృతి చెందిన పశువుల కాపరి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే పాల్వాయి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
సిర్పూర్ మండలం అచ్చెల్లి గ్రామానికి చెందిన పశువుల కాపరి శేఖర్ సుశీల మృతి చెందడంతో ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. మృతులు ఇద్దరిపై ఎలుగుబంటి దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నాయని వారికి రాష్ట్ర ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.