పాణ్యం సుబ్రహ్మణ్యేశ్వరునికి వెండి శూలం సమర్పణ
Panyam, Nandyal | Nov 11, 2025 పాణ్యంమండల పరిధిలోని ఎస్ కొత్తూరులో వెలసిన శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మిడుతూరు మండలం పీర్స పేటకు చెందిన వెంకట లక్ష్మయ్య 350 గ్రాముల వెండి శూలాన్ని సమర్పించినట్లు ఈవో రామకృష్ణ తెలిపారు. ఆలయ అర్చకులు దాతకు స్వామివార్ల ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సుబ్బారెడ్డి పాల్గొన్నారు.