రాజేంద్రనగర్: హయత్ నగర్ బస్సు డిపో ముందు బాధిత కుటుంబీకుల ధర్నా
గత నెల 27వ తేదీన వనస్థలిపురం పీఎస్ పరిధిలోని పిస్తా హౌస్ ముందు సాయికృష్ణ అనే యువకుడి కుడి చేయి పైనుంచి ఆర్టీసీ బస్సు వెళ్లింది. మంగళవారం బాధిత కుటుంబీకులు హయత్నగర్ బస్సు డిపో ముందు భైఠాయించి ధర్నా నిర్వహించారు. డీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. డ్రైవర్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సాయికృష్ణకు వెంటనే న్యాయం చేయాలని కోరారు.