కొండపి: సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరాన్ని పరిశీలించి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామన్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరాన్ని శనివారం ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ఆకస్మికంగా సందర్శించారు. పర్యటకులతో ఆకట్టుకుంటున్న సముద్ర తీరాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి స్వామి పేర్కొన్నారు. పర్యటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి కలెక్టర్ రాజాబాబును ప్రణాళికలను సిద్ధం చేయాలని మంత్రి స్వామి కోరారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.