జమ్మలమడుగు: పెద్దముడియం : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ క్యాంపు కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని పెద్దముడియం మండలం పెద్దముడియం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం స్వస్త్ నారి స్వశక్తి పరివార్ అభియాన్ ఆరోగ్యకరమైన మహిళలు బలమైన కుటుంబాల కోసం మెడికల్ క్యాంపు నిర్వహించారు.ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపును జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంట్లోని మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఈ సందర్భంగా వైద్యులు మహిళలకు పలు వైద్య పరీక్షలు నిర్వహించి, వ్యాధులపై పలు సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వైద్యులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.