ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో వైసిపి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ప్రజా ఉద్యమం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలల ప్రైవేటుకరణను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం వెనకకు తీసుకునేంతవరకు ప్రజలతో కలిసి ఉద్యమం చేపడతామన్నారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో ఉన్న పలువురు వైసీపీ నాయకుల స్వగృహం వద్దకు వెళ్లి పరామర్శించారు.