మొదటిరోజు శాంతియుతంగా డీఎస్సీ అభ్యర్థులను నిరసన:మద్దతు ఇచ్చిన ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు.
రంపచోడవరం ఐటీడీఏ ఎదురుగా సెప్టెంబర్ 17,18, 19న శాంతియుతంగా నిరసన తెలియజేయుటకు ఆదివాసి నిరుద్యోగులు పిలుపునిచ్చిన విషయం తెలిసినదే. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు అయిన బుధవారం నిరసన కార్యక్రమానికి ఆదివాసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా.రామారావు రంపచోడవరం ఐటీడీఏ ఎదురుగా నిరసన తెలుపుతున్న ఏపీ మెగా డీఎస్సీ 2025 అభ్యర్థులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ నోటిఫికేషన్ ఏపీ మెగా డీఎస్సీ 2025లో ఆదివాసి అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు.