పొన్నెమ్మ ఎస్టీ కాలనీకి రాకపోకలు బంద్
పొన్నెమ్మ ఎస్టీ కాలనీకి రాకపోకలు బంద్ నాగలాపురం(M) బయటకొడియంబేడు పంచాయతీకి చెందిన గుట్టపై ఉన్న పొన్నెమ్మ ఎస్టీ కాలనీకి సరైన దారి లేదని స్థానికులు వాపోయారు. బయటకొడియంబెడుకు రావాలంటే కాలనీ వాసులు వంకను దాటాల్సి ఉంది. భారీ వర్షాల కారణంగా వంకలో నీటి ప్రవాహం అధికంగా ఉంది. వంకలో ప్రవాహం తగ్గేంతవరకు రాకపోకల సమస్య తప్పదని, అధికారులు బ్రిడ్జిని నిర్మించాలని వారు కోరారు.