హిమాయత్ నగర్: ప్రభుత్వం పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలి : మాజీ మంత్రి కేటీఆర్
సికింద్రాబాద్ పరిధిలోని రెతి ఫైల్ బస్టాండ్ లో మాజీ మంత్రి కేటీఆర్ గురువారం మధ్యాహ్నం 2జే బస్సు ఎక్కి ప్రయాణికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్ టికెట్ ఇచ్చి పురుషులకు డబల్ టికెట్ ఇస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ నష్టాల్లో ఉందని చెప్పి అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నారని ప్రజా రవాణా అనేది ప్రభుత్వం బాధ్యత అని ప్రజల మీద భారం వేయకుండా ప్రభుత్వమే భరాయించాలని అన్నారు. పెంచిన ఆర్టీసీ బస్సు టికెట్ల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.