పూతలపట్టు: పాలకురు సమీపంలో గల జాతీయ రహదారిపై కారు బోల్తా ఒకరికి తీవ్ర గాయాలు
పూతలపట్టు మండలం పాలకురు సమీపంలో గల జాతీయ రహదారిపై కారు బోల్తా పడింది. స్థానికుల వివరాల మేరకు బెంగళూరు నుండి తిరుమల కి వెళ్తున్న కారు అదుపుతప్పి కారు బోల్తా పడింది. ఇందులో ముగ్గురు ప్రయాణిస్తుండగా ఒకరికి తీవ్ర గాయాలు అయినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారిస్తున్నట్లు తెలిపారు.