తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం బండారుపల్లి ఎస్టీ కాలనీలో కుటుంబ కలహాలతో పురుగులు మందు తాగి వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం సాయంకాలం చోటు చేసుకుంది వివరాలకు వెళితే గ్రామానికి చెందిన అనిలా కుమారి తన భర్త తరచూ మద్యం సేవిస్తూ ఉండడంతో తీవ్ర మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది గమనించిన కుటుంబ సభ్యులు 108 సహాయంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలించమని వైద్యులు సూచించారు