భీమిలి: తీగలవాని పాలెం చెరువు వద్ద ఆటో అదుపుతప్పి డ్రైవర్ మృతి
ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చందక పంచాయతీ జగన్నాధపురం గ్రామానికి చెందిన ఎర్ర గౌరి నాయుడు (40) ఆటో డ్రైవర్. గురువారం ఇంటి నుంచి బేరం మీద వెళ్లి తిరిగి వస్తుండగా కుసులవాడ తీగలవాని పాలెం చెరువు దగ్గర కుక్క అడ్డం రావడంతో ఆటో అదుపుతప్పి పక్కనే ఉన్న చెరువులో బోల్తా కొట్టింది. తలకు, ముక్కుకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఎర్ర జయ (33) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆనందపురం సిఐ సిహెచ్ వాసు నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు నిమిత్తం ఎస్సై జి సంతోష్ కి అప్పగించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.