శంషాబాద్లో యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. ఈ కేసు వివరాలను ఆర్జీఐఏ క్రైం ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం పుడుకొట్టయ్ ప్రాంతానికి చెందిన చిన్నరాసు నారాయణ స్వామి (వయసు సుమారు …) శంషాబాద్ పరిధిలోని మధురానగర్ స్ట్రీట్ నెంబర్–3లో అర్ధరాత్రి సమయంలో రోడ్డుపై పడిపోయి ఉన్నాడని స్థానికులు గుర్తించారని తెలిపారు. విషయం పోలీసులకు తెలియజేయగా, శనివారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, యువకుడు మృతిచెందినట్టు నిర్ధారించారు.