నార్సింగి: రామాయంపేట మండల వ్యాప్తంగా ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
Narsingi, Medak | Jan 26, 2025 రామాయంపేట మండల వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు జాతీయ జెండాలు ఆవిష్కరించి సంబరాలు నిర్వహించారు. స్థానిక గాంధీ విగ్రహం వద్ద మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి జాతీయ జెండా ఆవిష్కరించగా, మున్సిపల్ కార్యాలయం వద్ద చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ జాతీయ జెండా ఆవిష్కరించారు, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై బాలరాజు, సిఐ కార్యాలయం వద్ద సిఐ వెంకట్ రాజా గౌడ్, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో సాజుల్లొద్దీన్, తహసిల్దార్ కార్యాలయంlo రజనీకుమారి ఎగురావేశారు.