నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరంలోని శ్రీ చౌడేశ్వరి దేవి మాల విరమణ కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించారు. మాల స్వీకరణతో అనంతరం మండలం రోజులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలిచి మాల విరమణ చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగా భక్తుల విశేషంగా హాజరై సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో చండీయాగం నిర్వహించనున్నారు. ఆలయ ఛైర్మన్ నాగార్జున రెడ్డి, ఆలయ కమిషనర్ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది సహకారంతో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.