మదనపల్లిని జిల్లా చేస్తూ, పీలేరు ను రెవిన్యూ డివిజన్ గా ప్రభుత్వం ప్రకటించడం పై పీలేరులో కూటమి శ్రేణులు మంగళవారం సాయంత్రం సంబరాలు జరుపుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మదనపల్లి జిల్లాగా, పీలేరును రెవెన్యూ డివిజన్ గా చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం దీని పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో గలం వినిపించడంతో పాటు ప్రభుత్వాన్ని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో అమరావతిలో జరిగిన సమావేశంలో మదనపల్లి ని జిల్లా గా, పీలేరు ను రెవిన్యూ డివిజన్ గా ప్రభుత్వం ప్రకటించింది